Sunday, August 15, 2010

భారత స్వాతంత్ర్యపర్వదినం

కం:-
మాతల్లి! భూమి భారతి
చేతన మహనీయ ధాత్రి! చేతున్ జయతుల్;
స్వాతంత్ర్యపర్వదినమున
భూతలి నలుదిక్కులలర భూయిష్ఠముగన్!

కం:-
దేశము భాషామతము
ద్దేశములున్ వేరువేరు తీరులనంచూ,
ఆశీవిషముకు వలెనా
వేశాగ్రణిగ మనుట, తగు మేలా మనకున్?

మత్తకోకిల:-
భారతీ! భరతాది దివ్యుల భవ్యసీమవు నీవుగా!
వారణాసి, గయప్రయాగల వాసిగాంచిన భూమివై,
మారణాయుధ ఘాతముల్, మరి మాయజేసెడి నేతలన్
ఓరిమిన్ భరియింపజాలున? నోడగొట్టుమ వారలన్!

3 comments:

  1. మత్తకోకిల బాగుంది.

    ReplyDelete
  2. లంక సత్కవి లాలితంబగు లక్షణాన్విత పద్యముల్
    జంకు గొంకు గనంగ జాలక చాల యద్భుత మౌనటుల్
    వంక లెన్నగ జాల నట్టుల భవ్యరీతుల నొప్పె.ని
    న్నింక చిన్నగ చూడ రాదుగ! ఏమనందువయా? రవీ!

    ReplyDelete
  3. ఏమనందును రామకృష్ణులు యెంచనన్నొక పెద్దగా?
    ప్రేమయో! నభిమానమో! నిరుపేదనే కవిగా సుమా!
    ఝాముఝాము ప్రదీప్తమౌ కవిజాతవేదులు యెక్కడో!
    ఏమరిల్లుచు నీమముల్ చను నీరవీంద్రుడు నెక్కడో!

    ReplyDelete