Sunday, August 8, 2010

శివునిపై "శ్రీ" చక్ర బంధ తేటగీతము

తే:-
శిశిర రాజుకు శ్రీకంఠి చేవ; దేని
నిబిడు నాముఖశ్రీ? ఫాలనీలికాంతి
యమళులందున శ్రీలు; మాయా స్వభావ!
శివుని ఛాయన నిర్భీతి జీవరాశి.

భా:-
శివుడంటే జటాజూటాలతో భీతిగొలిపేలా ఉంటాడని, స్మశానంలో నర్తిస్తాడని విని భయపడనవసరంలేదు. చంద్రునకు ఆయనే కదా ఆధారం. నీలి కలువలలో ఆయన మూడవనేత్రాన్ని కలిగి ఉండే ఫాలము యెక్క కాంతే కదా ప్రతిబింబిస్తుంది. వీటిని చూసి మనం ఆనందించటంలేదా? మాయతో కూడిన స్వభావం కలవాడు కనుకనే మనకు అలా అనిపిస్తుంది. అసలు చెప్పాలంటే ఆయన రక్షలో సృష్టి యెంతో సురక్షితం.

3 comments:

  1. కం:-
    చింతా వారల వింతలు
    కొంతయినను అబ్బె నాకు, కోరిక దీరెన్.
    అంతా మీ కృపయె సుమా!
    సంతోషము గలిగె; శ్రీయె సంభృతమయ్యెన్!

    ReplyDelete
  2. శ్రీ చక్ర బంధ కవులకు
    శ్రీ చక్రమె యొసగు శక్తి శ్రేయస్కరమై.
    చూచితి నద్భుతమయ్యా!
    ప్రాచీన రచన నరసిన భవ్యుఁడ వయ్యా!.

    ReplyDelete