కం:-
అనుపమ గుణనిధివని యల
రిన నిను, దొర! గని, సుగుణచరిత! మురియు మదిన్,
గని నిను నిరతము, యిలను, క
లను, నను గనగ కలిగె ఘనలతిక కవితగన్.
భా:-
సాటిలేనటువంటి గుణాలకు నిలయముగా శోభిల్లే ఓ వినాయకా! చక్కని చరిత కలవాడా! నిన్ను చూస్తే చాలు మురిసిపోయే నా మదిలో నిన్ను నిరతమూ ఇలలోనూ కలలోనూ కూడా తలుస్తూ(చతురంగబంధకందం ప్రసాదించవయ్యా! అంటూ), నాదిక్కుగా చూసేటప్పటికి ఈ పొడవైన తీగలాంటి(సర్వలఘు కందం కదా!) కవిత కలిగిందయ్యా!
ఈ కందంలో "నిరతము నినుగన ఘనతరమగునని" అనే అర్ధంతో సాగే తురగగతులను క్రింద చూడవచ్చు.
ఇంకా స్పష్టంగా వ్రాయచ్చనిపించింది కాని, ప్రస్తుతానికి నా సామర్థ్యత ఇంతేనేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రయత్నంలో పదాల యెంపిక గురించి చాలా నేర్చుకోగలిగాను. పూజ్యులైన శ్రీ చింతా రామకృష్ణారావుగారికి యెంతో కృతజ్ఞుణ్ణి. నా దృష్టిలో ఈ ప్రయత్నం అంతగా ఫలించకపోయినా, మెప్పుతెచ్చే తృప్తి కంటే విమర్శలిచ్చే నొప్పే ఈ విద్యలో రాణించడానికి యెక్కువగా ఉపయోగపడుతుందని తలచి, ప్రచురిస్తున్నాను. స్వేచ్ఛగా మీ అభిప్రాయాలను తెలుపగలరు.

దొర! గన
ReplyDeleteదొర గని
ఏది సరి?
మందాకినిగారూ! "దొర! గని" సరైనదండీ. అచ్చుతప్పుని సరిచేసి, స్పష్టంగా వ్రాయలేదు కనుక, భావాన్ని కూడా తెలిపాను.
ReplyDeleteమొన్ననే మొదలుపెట్టి అప్పుడే బంధకవిత్వం వఱకూ వెళ్ళి పోయిన మీకు అభినందనలు।
ReplyDeleteరవీంద్రా! అప్పుడే చదరంగమాడడంలో ప్రవీణుఁడవైపోయావే!!!
ReplyDeleteశభాష్! నీ ఆసక్తిని; కృషిని అభినందిస్తున్నాను.
అత్యద్భుతమైన పద్యాలు ఇంకా ఇంకా బొలెడన్ని వ్రాయాలని మనసారా కోరుకొంటూ ఆశీర్వదిస్తున్నాను.
శుభమస్తు.
ఒక్కొక్కరికి ఒక్కో ప్రక్రియ మీద ఆసక్తి, అభినివేశం హెచ్చుగా ఉంటాయి. అది కనుక్కోవడమే పెద్ద సమస్య.మీకు తొందరగానే ఆ సమస్య తీరింది. బహు చక్కగా వ్రాశారు.
ReplyDeleteస్వనామధేయా, (నా పేరు పెట్టుకున్నారుగా! :-))మీరు మరిన్ని వ్రాయాలండి.
ఆశీర్వదించిన పెద్దలందరకూ నమస్సులు. అభినందనలు తెలిపిన వారందరకీ కృతజ్ఞతలు. గురువులు లేకుండా యీ విద్య యెలా సాగుతుందో అన్న నా సమస్యకు మీ రచనలతోనూ, మీ సలహాలతోనూ చక్కగా పరిష్కారం చూపుతున్నారు. మీకందరకూ యెంతో ఋణపడి ఉంటాను.
ReplyDeleteస్వనామధేయులైన రవిగారూ!
ReplyDeleteఅభినందనలకు కృతజ్ఞతలండీ! నా భావాలను అందంగా చెప్పగలిగితే నాకు అదే పదివేలు. బంధకవితా ప్రవీణుడనవ్వాలన్నది నాకోరిక యెంత మాత్రమూ కాదు. యెటొచ్చి, లెక్కలు నేర్చుకొనేటప్పుడు యెంత కష్టమైనవి యెంచుకొంటే అంత బాగా లెక్కలబ్బుతాయి. కవిత్వం కూడా అంతే అనిపించి ప్రయత్నించానంతే. దానికి తోడు, పూజ్యులైన మన రామకృష్ణారావుగారు, ఆయన వ్రాసిన తర్వాత "మీరూ ప్రయత్నించండం"టున్నారు కాని అందులో ఉన్న చిక్కులు ముందు చెప్పటంలేదు కదా! మీరూ తప్పక ప్రయత్నించండి. పద్యాలు కుదిరినా, కుదరకపోయినా ప్రయత్నంలో పడే తిప్పల వలన నేర్చుకునే విషయాలు అన్ని యిన్నికాదు. మామూలు పద్యాలు వ్రాసేటప్పుడు చాలా సులభంగా పదాలు దొరుకుతాయి.
రవీంద్రా! మిమ్మల్ని ప్రయత్నించమన్న మాట వాస్తవమే.కాని దానిలో ఉన్న చిక్కులు చెప్పలేదన్నారు. నాకైతే చిక్కులేవీ కలుగనందున చెప్పే అవకాశం లేదు. ఆ చిక్కులేంటో వ్రాసేవారికే తెలుస్తాయి. ప్రయత్న వైరళ్యమే చిక్కులన్నీ పోగొట్ట గలదని మీరు వ్రాసి పద్యం మీకు తెలియ జేయ లేదా? వ్రాయాలనే ఆసక్తి కలిగించ గలిగితే అక్కడి నుండి కవి కలమే నడిపిస్తుంది. ఈ పర్యాయం శ్రీ చక్ర బంధం ప్రయత్నించి వ్రాస్తే చాలా ఆనందం నాకు కలిగించిన వారౌతారు. ఈప్సితార్థ ఫలసిద్ధులు కండి.
ReplyDeleteశుభమస్తు.