Tuesday, July 6, 2010

"శ్రీరామా!"యని

శా:-
"శ్రీరామా!"యని తల్చినంత మనమున్, శింజానమంజుధ్వనిన్
క్రూరాంతర్గతభూరిదుర్గుణతతిన్ క్రుంకింపగా జేయుచూ,
ఘోరాటంకవినాశతత్పరమతై, కోదండమే యండగా,
మా రాముండు మహాద్భుతమ్ముగ గనున్, మమ్మెల్ల సౌఖ్యమ్మునన్.


వృత్తాలంటే జంకు పోవాలని ఈ సాహసం చేసాను. రాముడంటే మొట్టమొదట నాకు ధర్మాన్నెన్నడూ కాపాడే ధనుర్బాణాలే గుర్తొస్తాయి. వాటితో మనల్ని కాపాడతాడనే భావం తీసుకు రావడంకోసం, ధ్వనులకంటే భావానికి ప్రాధాన్యతనిస్తూ వ్రాసాను. తప్పులు గమనిస్తే తెలుపగలరు.

2 comments:

  1. చక్కనైన పద్యం బాబాయ్! కొంచెం సంధుల విషయంలో సందేహాలు కనబడుతున్నాయి. పెద్దలెవరైనా చెప్తారేమో చూద్దాం.

    ReplyDelete
  2. భావం బాగున్నది రవీ !!

    ReplyDelete