కం:-
ఛురికనొదలి తురగగతిని
పరుగిడవలెననుచు మనము, పలువిధములుగన్
హరిచరణములకు ప్రణతులు,
కరివదనునకును వినతులు ఘనమని తెలిపెన్.
చ"తురంగ" బంధం వ్రాయాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది. ఎవరి గురించి వ్రాసి నన్ను బంధముక్తుణ్ణి చేసుకోవాలో నిర్ణయించుకోలేక పోతుంటే, పైన యిద్దరి గురించి యెన్ని విధాలుగా వ్రాసినా బాగుంటుదని నా మనసు తెలుపుతోంది అన్నది నా ఉద్దేశం.
Monday, June 28, 2010
Subscribe to:
Post Comments (Atom)
తురగములతొ( తురగములతో అని ఉండాలి. తొ అని ఉండ కూడదు) కు బదులు తురగ గతిని అని అంటే బాగుంటుంది. పద్యంలో భావం స్పష్టంగా వ్యక్తమవాలి.
ReplyDeleteతృతీయా విభక్తిని అణగొట్టకూడదని తెలుసుకున్నాను. ఇదే నియమం మిగతా విభక్తులు, చే,చేన్,లో,లోన్ మున్నగువాటికి కూడా వర్తిస్తుందని గమనించాను. ఇకముందు ఈ దోషం జరగకుండా జాగ్రత్తపడతాను. చెప్పినందుకు ధన్యవాదములు. మీరు చెప్పినట్లు చిన్న చిన్న మార్పులు చేసాను. యితర దోషాలు గమనిస్తే తప్పక తెలుపగలరు.
ReplyDeleteబావుంది. ఆచార్య ఫణీంద్ర గారు ఈ విషయమై ఈ టపా వ్రాసారు ఇదివరకు.
ReplyDelete