బంధ బుధవిధ విశారద!
సుందర దరహాసితాస్య! సుగుణాంబునిధీ!
ధీ,దమ,శమ గుణశరధీ!
సుందర కవనారవింద ఛురికాకంధీ!
ఛురిక అంటే కత్తి. మరి ఆ కత్తి ఎక్కడుందో చూద్దామా?
(ఈ ప్రక్రియ చెప్పిన చింతా రామకృష్ణారావుగారికి కృతజ్ఞతలు తెలుపుతూ వ్రాసిన పద్యం. పోటీగా మాత్రం కాదు.)

ఈ మధ్య నా మనసు విచ్చుకున్నా, నొచ్చుకున్నా పద్యాలల్లటం అలవాటయ్యింది. పలుమంది ప్రతిభావంతుల విమర్శలు దొరికితే, నాయీ విద్య అతిశయిల్లుతుందన్న ఆశతో మీముందుంచుతున్నాను.
భవదీయుడు,
రవీంద్ర.
రంగులతో అలంకరించడం బాగుంది.
ReplyDeleteరవి గారూ,
ReplyDeleteమంచి ప్రయత్నం. బాగుంది. కాని ద, ధ ప్రాస చెల్లదు కదా. రంధ్రాన్వేషణ అనుకోకండి. పొరపాటు ఎత్తి చూపానంతే. "ప్రమాదో ధీమతామపి" అన్నారు కదా.
కంది శంకరయ్యగారూ, ద-ధ, ధ-థ, ఱ-ర, న-ణ, ల-ళ లకు ప్రాస చెల్లుతుందికదండీ.
ReplyDeleteద, ధ ల యతిమైత్రి కొంతమంది ఒప్పుకోలేదు. అయితే ఏదో తిక్కన పద్యం ఇలా ఉందన్నట్టు వినికిడి. అయితేనూ మూడవపాదంలో అనుస్వరం రావాలి. (ఇదివరకే మీకో వేగు పంపాననుకుంటాను ఈ విషయంపై)
ReplyDelete