కం:-
అంబా! బాహ్యాంతరచర!
మాం, బంభరబృందవేణి! పాహి త్రివేణీ!
అంబర మహిమా చుంబిత
అంబుజ సింహాసన జనితానందాబ్ధీ!
బొమ్మలో పసుపు రంగులో ఉన్న అక్షరాలన్నింటికీ రెండువైపులా సమాన సంఖ్యలో మిగతా అక్షరాలుంటాయి. పసుపు రంగులో ఉన్నవాటిని, చదివితే "అంబా మాంపాహి సదా". హా! చివరికి అమ్మవారికి సింహాసనం రూపించాను! వ్రాస్తున్నప్పుడు కష్టంఅనిపించినా, ఇప్పుడూ చాలా హాయిగా ఉంది.
Tuesday, June 22, 2010
Subscribe to:
Post Comments (Atom)
బాగుందండీ.
ReplyDeleteబంభర అంటే ఏమిటో దయచేసి చెప్పగలరా!
మందాకిని గారూ, బంభరము అంటే తుమ్మెదండీ. తుమ్మెదలగుంపులాంటి(అందమైన) జడకలదానే అనే అర్ధంతో వాడాను.
ReplyDeleteరవి గారూ,
ReplyDeleteమీకున్న పదసంపద చూస్తే నాకు ఈర్ష్య కలుగుతోంది. సింహాసన బంధం బాగుంది. అయితే పద్యంలో మొదటి పాదంలో గణదోషం (తరప్రభ - సమాసగతం కనుక ర గురువు అవుతుంది), రెండవ పాదంలో యతిదోషం (మ-ప లకు) ఉన్నాయి. గమనించ గలరు.
శంకరయ్యగారూ,
ReplyDeleteగణదోషాలను చూపినందుకు ధన్యవాదాలు. దిద్దాను, చూడండి.
హల్లులు(ప-ఫ-బ-భ-మ-వ) లకు పరస్పర యతి మైత్రి చెల్లుతుంది. అలాగే అచ్చులు(అ-ఆ-ఐ-ఔ-అం-అః) లకు కూడా పరస్పర యతిమైత్రి చెల్లుతుంది. కనుక, (మాం-పా)లకు యతిమైత్రి సరిపోతుందికదండీ.
రవీంద్ర గారు, క్షమించాలి. ప - మ లకు యతిమైత్రి చెల్లదండి. అయితే పు-ము లకు మాత్రం చెల్లుతుంది. ఇక్కడ వ్యాఖ్యలుచూడండి. సులక్షణసారము ఓ సారి చదువగలరు.
ReplyDeleteరవి గారు మీ పద్యాలు చాలా బాగున్నాయండీ నెనిన్నాళ్ళు చూడ లేదు సిమ్హాసన బంధం చక్ర బంధం చురికా బంధం అన్ని బాగున్నాయి. నాకు చందస్సు పిచ్చి కానీ సరిగా రాయడం రాదు అభినందనలు
ReplyDeleteమీ అభినందనలకు ధన్యవాదాలు రాజేశ్వరి గారూ! నేనూ క్రితం సంవత్సరమే ఛందోబద్దంగా పద్యాలు వ్రాయటం నేర్చుకున్నాను. ప్రయత్నించండి, తప్పక మీరు కూడా వ్రాయగలరు.
ReplyDeleteమీ ప్రోత్సాహానికి ధన్య వాదములు రవీంద్ర గారు
ReplyDelete