Sunday, June 27, 2010

ఛురికాబంధంలో గణపతి ప్రార్ధన

కం:-
జ్ఞానవన! ఘనగుణావన!
దానవ నశ్వరకృతామృతా! కరివదనా!
నానాత్వవినాశక! వర
దా! నవసౌగంధిభూషితా! ధీ సదనా!

4 comments:

  1. చాలా చక్కగా ఉంది బాబాయ్.

    ReplyDelete
  2. ఛురికా బంధము చక్కగ
    పరికించగ తోచు.సకల శుభముల కొఱకై
    వర గణనాధుని కొలిచిన
    పరమాద్భుత విధముఁ గంటి. భవ్యుఁడవు రవీ!

    ReplyDelete
  3. ధన్యుడనైతిని! మెప్పును
    మాన్యులు శ్రీ రామకృష్ణ మహనీయులచే
    కన్యక నా కవిత బడసె,
    పుణ్యములేజన్మవొగద! పురుషార్థముగన్!

    ReplyDelete
  4. వా! ఛురిక లాంటి పద్యం. భేష్!!

    ReplyDelete